విశాఖ జిల్లా పాడేరులో ఏరువాక ప్రారంభ పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి మణికుమారి నాగలి పట్టి..పొలం దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నప్పటికీ.. వ్యవసాయంపై ఆమెకున్న మక్కువతో హలం పట్టారు. తన వ్యవసాయ భూమిలో ఎద్దులకు బొట్టు పెట్టి ..హలం పట్టి.. పొలం దున్నే ఏరువాక పండుగ ప్రారంభించారు. ప్రతి ఏటా ఏరువాక పండుగ చేస్తూ..వ్యవసాయంపై ఆమెకు గల ఇష్టాన్ని చాటుకున్నారు.
హలం పట్టి..పొలం దున్నిన మాజీ మంత్రి మణికుమారి
ఏరువాక మొదలవ్వగానే..రైతన్నలు పొలం పనులలో తలమునకలవుతారు. జీవితాన్ని ఇచ్చే పొలం, వ్యవసాయం చేసే ఎద్దులు, పనిముట్లకు పూజలు చేసి..నాగలి పట్టి పొలం దున్నుతారు. ఏరువాక ప్రారంభ పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి మణికుమారి హలం పట్టి.. పొలం దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు.
పొలం దున్నిన మాజీ మంత్రి మణికుమారి