ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం: అయ్యన్నపాత్రుడు - విశాఖలో అయ్యన్నపాత్రుడు

ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి మండిపడ్డారు. 16 నెలలు జైలుశిక్ష అనుభవించిన వ్యక్తి ఉత్తరాంధ్ర జిల్లాలపై పెత్తనం చెలాయించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో చేపట్టిన తెదేపా సాధన దీక్షలో రాష్ట్రప్రభుత్వంపై మండిపడ్డారు.

Ayyannapatru comments on mp Vijayasai Reddy
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

By

Published : Jun 29, 2021, 4:16 PM IST

కరోనా పరిస్థితులను ఎదుర్కోవటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద 'సాధన దీక్ష'ను ఆయన చేపట్టారు. రాష్ట్రంలో కరోనా మరణాలు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జరిగాయని పేర్కొన్నారు. మృతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఇప్పటికే నియోజకవర్గాల వారీగా జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టి వినతిపత్రాలు సమర్పించినా ఇప్పటికీ స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఆరోపించారు.

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు విషయంలో ఎంతో ఉత్సాహం చూపిన చట్టం.. విశాఖ డెయిరీ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు.16 నెలలు జైల్లో గడిపిన వ్యక్తి , ఉత్తరాంధ్ర జిల్లాలపై పెత్తనం చెలాయించడం హాస్యాస్పదంగా ఉందని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.


ఇదీ చదవండి:DISHA APP: 'దిశ' యాప్ ఉంటే..మీ అన్నయ్య తోడున్నట్లే: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details