ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మంచి వైద్యుడిని పిచ్చివాడని ముద్ర వేస్తున్నారు'

వైద్యుల అత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఇందుకు డాక్టర్ సుధాకర్​పై కక్ష్య సాధింపే ఒక నిదర్శమని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. విశాఖ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్యుడు డాక్టర్ సుధాకర్​ను తెదేపా బృందం పరామర్శించింది.

Former Minister Ayyanapatrudu  visited hospital for dr.sudhakar
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా సమావేశం

By

Published : May 18, 2020, 11:25 PM IST

వైద్యుని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేట్టుగా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తొందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. విశాఖ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్యుడు డాక్టర్ సుధాకర్ ను తెదేపా బృందం పరామర్శించింది. డాక్టర్ సుధాకర్​కి న్యాయం చేయాలని అన్ని స్థాయిల్లోనూ విజ్ఞప్తి చేశామని, అటు రాష్ట్రపతి, ప్రధాని, జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్​కి ఫిర్యాదు చేశామన్నారు.

వైద్యుడిని అంత దారుణంగా కొట్టిన పోలీసులపై ఎస్టీ కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పీపీఈ కిట్లు కోసం ప్రశ్నించిన వైద్యుడిని హింసించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహిస్తున్న అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. నర్సీపట్నంలో అత్యధిక డెలివరీ కేసులు విజయవంతంగా అయ్యాయంటే మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ సుధాకర్ పాత్రే అని గుర్తుచేశారు. అటువంటి మంచి వైద్యుడిని పిచ్చివాడని ముద్ర వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని చెప్పారు. వైద్య సంఘాలు అండగా నిలబడాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.

ఇదీచూడండి.సింహాచలంలో పామును పట్టుకున్న అర్చక స్వామి

ABOUT THE AUTHOR

...view details