తెలుగు రాష్ట్రానికి చెందిన నిఖత్ జరీన్.. టర్కీలో జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన నిఖత్ జరీన్‌కు ఆమె మాజీ కోచ్ వెంకటేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ సమయం నుంచి జరీన్లో పట్టుదల, అకుంఠిత దీక్ష ఉండేదని.. అదే తనని ఈరోజు విజేతగా నిలిపిందన్నారు. పవర్ పంచ్.. ప్రత్యర్థిని గుక్క తిప్పుకోకుండా కొట్టడంలో జరీన్‌ది అందివేసిన చెయిగా చెప్పారు.
'పట్టుదల, అకుంఠిత దీక్షే జరీన్‌ను.. ప్రపంచ ఛాంపియన్‌ను చేశాయి' - నిఖత్ జరీన్ వార్తలు
జరీన్ పట్టుదల, అకుంఠిత దీక్షే తనని ప్రపంచ ఛాంపియన్‌ను చేశాయని ఆమె మాజీ కోచ్ వెంకటేశ్వరరావు అన్నారు. ఖచ్చితంగా జరీన్.. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2011 నుంచి 2018 వరకు విశాఖలో స్పోర్ట్ అథారిటీ ఫ్ ఇండియా శిబిరంలో వెంకటేశ్వరరావు వద్దే జరీన్ శిక్షణ తీసుకుంది.
వెంకటేశ్వరరావు
2011 నుంచి 2018 వరకు విశాఖలో స్పోర్ట్ అథారిటీ ఫ్ ఇండియా శిబిరంలో వెంకటేశ్వరరావు వద్దే జరీన్ శిక్షణ తీసుకుంది. ఖచ్చితంగా జరీన్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు
ఇదీ చదవండి:చరిత్ర సృష్టించిన తెలుగు తేజం నిఖత్ జరీన్.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పంచ్..