ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 3, 2019, 9:33 AM IST

Updated : Mar 3, 2019, 10:00 AM IST

ETV Bharat / state

టెలిగ్రామ్‌తో వల... నిందితుడి అరెస్ట్

మొబైల్ ఉపయోగించడమే కాదు...అందులోని డేటా తస్కరణకు గురికాకుండా చూసుకోవాలి. యాప్స్‌తో సమాచారం చోరీ చేసే కేటుగాడిని విశాఖ పోలీసులు అరెస్ట్​ చేశారు.

సైబర్ మోసగాడు అరెస్ట్

ఘరానా సైబర్ నేరగాడు అరెస్ట్

ఇప్పుడు ఏ సమాచారం తెలుసురకోవాలన్నా... ఎవరికి చేరవేయాలన్నా... యాప్స్‌ ఓ సాధనం. అలాంటి యాప్స్‌ ఇప్పుడు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నాయి. సైబర్‌ బారిన పడకుండా ఉండాలని పేరున్న సంస్థల అప్లికేషన్‌లు వాడుతున్నా... ముప్పు తప్పడం లేదు. మారుమూల ప్రాంతాల్లోనే ఉంటూ... ఎక్కడెక్కడో సుదూర తీరాల్లో ఉన్న వారి సొమ్ములు దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అలాంటి నేరస్తుణ్ని విశాఖ పోలీసులు పట్టుకున్నారు.

క్లోనింగ్‌తో కన్నింగ్

బల్గేరియాకు చెందిన వాల్కనోవ్‌ మిరోస్లావ్‌... కార్డు క్లోనింగ్‌తో నగదు కాజేసే ఘరానా కిలాడీ పోలీసులకు చిక్కాడు. ఎప్పటి నుంచే నిఘా పెట్టిన అధికారులకు ఎట్టకేలకు చిక్కాడు. ఇతగాడు... యూఎస్‌, యూకే, ఫ్రాన్స్‌ దేశాల్లో కార్డు వినియోగదారులను నిలువునా ముంచేశాడు. ఓ అంతర్జాతీయ ముఠాలో సభ్యుడైన ఇతను... కార్డు క్లోనింగ్ చేసి.. విదేశీయుల ఖాతాల్లో నగదు మాయం చేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు అందుకున్న ఆయా దేశాల పోలీసులు...విచారించగా...విశాఖలో తతంగం నడుస్తోందని తేలింది.

విశాఖ పోలీస్‌ స్మార్ట్‌

విదేశీ పోలీసుల సమాచారం అందుకున్న విశాఖ పోలీసులు ఈ అంశంపై ప్రత్యేక నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో ఆయన నివాసంపై దాడి చేసి అరెస్టు చేశారు. అతని నుంచి 13 లక్షల రూపాయల నగదు, 2 వేల అమెరికన్ డాలర్లు, క్లోనింగ్ యంత్రం, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Mar 3, 2019, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details