ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Afghanistan crisis: ఏయూలో అఫ్గానిస్థాన్​ విద్యార్థుల నిరసన పద్రర్శన - అఫ్గానిస్థాన్​ పరిస్థితులపై తాజా వార్తలు

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అఫ్గానిస్థాన్​ పరిస్థితులకు వ్యతిరేకంగా ఆ దేశ విద్యార్థులు నిరసన చేపట్టారు. తాలిబన్ల కారణంగా అఫ్గానిస్థాన్​ పూర్తిగా నాశనమైందని విచారం వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్​ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని విదేశీ విద్యార్థులు కోరారు.

Afghanistan crisis
Afghanistan crisis

By

Published : Sep 16, 2021, 7:10 PM IST

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అఫ్గానిస్థాన్​​ పరిస్థితులకు వ్యతిరేకంగా ఆ దేశానికి చెందిన విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు. పంజ్ షేర్​కి తమ మద్దతు ప్రకటించారు. అఫ్గానిస్థాన్​​లో మానవ హక్కులు, మహిళా హక్కులు లేవని ఆవేదన చెందారు. తాలిబన్ల కారణంగా అఫ్గానిస్థాన్​ పూర్తిగా నాశనమైందని విచారం వ్యక్తం చేశారు. తాలిబన్లలో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారని.. అందుకే వారికి పాలన తెలియదని అభిప్రాయపడ్డారు. తాలిబన్లు ఆక్రమించిన తర్వాత.. అక్కడ ప్రజలు ఉండలేక విమానాలను పట్టుకున్న పరిస్థితులు టీవీలో చూసి చలించిపోయామని ఆవేదన చెందారు.

అఫ్గానిస్థాన్ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని ఆ దేశ విద్యార్థులు కోరారు. భారత్ అఫ్గానిస్థాన్​కు బాసటగా నిలవాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము అక్కడకు వెళ్లలేమని.. ఇక్కడే విద్య అభ్యసించడానికి సహకారం ఇవ్వాలని కోరారు. అఫ్గానిస్థాన్​లో పరిస్థితులు చూస్తే ఆందోళనగా ఉందని విద్యార్థులు ఆవేదన చెందారు.

ఏయూలో అఫ్గానిస్థాన్​ విద్యార్థుల నిరసన పద్రర్శన

ఇదీ చదవండి:

HIGH COURT: చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు వైకాపా రంగులపై హైకోర్టు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details