ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తాండవ జలాశయం ఆధునీకరణకు రూ. 470 కోట్లు

By

Published : Mar 21, 2021, 3:15 PM IST

Updated : Mar 21, 2021, 4:15 PM IST

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలంలో ఉన్న తాండవ జలాశయం ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 470 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ నిర్ణయంపై.. ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు.

For modernization of Thandava reservoir Rs. 7 crores
తాండవ జలాశయం ఆధునీకరణకు రూ. 7 కోట్లు

తాండవ జలాశయం ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 470 కోట్లు కేటాయించడం హర్షణీయమని.. విశాఖ జిల్లా వ్యవసాయ అభివృద్ధి మండలి చైర్మన్ చిక్కాల రామారావు తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గం గోపాలపట్నంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు.

సీఎం జగన్ రైతుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని సాగునీటి వనరుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని రామారావు చెప్పారు. గతంలో వైఎస్​ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు..​ తాండవ నదిపై నిర్మించిన ఆనకట్టల ద్వారా సాగు, తాగునీటి అవసరాలు తీరాయని ఆయన గుర్తు చేశారు.

Last Updated : Mar 21, 2021, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details