ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫుడ్​ సేఫ్టీ అధికారుల దాడుల్లో విస్తుపోయో వాస్తవాలు.. - hotels in visakhapeatnam news updat

అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారి నందాజి ఆధ్వర్యంలో విశాఖలోని హోటళ్ల​పై అధికారులు దాడులు నిర్వహించారు. లాక్​డౌన్​ సమయంలో సైతం హోటళ్ల​ యాజమాన్యం అధిక మోతాదులో ఆహారం నిల్వ ఉంచడం చూసి ఆధికారులు ఆశ్చర్యపోయారు. నిబంధనలు పాటించనివారిపై కేసులు నమోదు చేశారు.

Food Safety Officers' checks in hotels
హోటల్స్​లో ఫుడ్​ సేఫ్టీ అధికారుల తనిఖీలు

By

Published : Jun 29, 2020, 10:39 PM IST

విశాఖలోని వివిధ హొటళ్లపై ఆహార భద్రత విభాగం అధికారుల నిర్వహించిన దాడుల్లో విస్తు పోయే వాస్తవాలు బయటపడ్డాయి. ద్వారకానగర్, డైమండ్ పార్క్ వద్ద గల హోటళ్ల​పై అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారి నందాజి ఆధ్వర్యంలో దాడులు చేశారు. కొన్ని ప్రముఖ హోటళ్లలో భారీగా నిల్వ ఉంచిన ఆహారాన్ని గుర్తించి అధికారులు.. ఆ ఆహారాన్ని బయట పడేశారు. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం నిబంధనలు పాటించని హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేశారు.

ఇవీ చూడండి...:అప్పన్న స్వామి ఆఖరి గంధం అరగదీత

ABOUT THE AUTHOR

...view details