రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే... క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాల గురించి మాత్రం అధికారులు పట్టించుకోవటం లేదు. విశాఖ జిల్లా రోలుగుంట క్వారంటైన్ కేంద్రంలో సరైన సౌకర్యాలు లేవని కరోనా అనుమానితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సరైన ఆహారం ఇవ్వడం లేదని.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానిక బీసీ సంక్షేమ వసతిగృహంలో కొద్ది రోజుల కిందట ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో కొండపాలెం, అడ్డసరం తదితర గ్రామాలకు చెందిన కరోనా అనుమానితులు ఉంటున్నారు.
క్వారంటైన్ కేంద్రంలో ఆహారం ఇవ్వడం లేదని బాధితుల ఆందోళన - రోలుగుంట కరోనా క్వారంటైన్ సెంటర్ వార్తలు
విశాఖ జిల్లా రోలుగుంట క్వారంటైన్ కేంద్రంలో తగిన ఆహారం లేదని కరోనా అనుమానితులు ఆరోపిస్తున్నారు. అధికారులు తమను సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
Food problems in corona Quarantine centers at rolugunta in visakhapatnam district