కరోనా లాక్డౌన్ కాలంలో పేదలకు, వలస కూలీలకు దాతలు తమ వంతు సహాయం అందించి దాతృత్వాన్ని చాటుతున్నారు. తాజాగా...విశాఖ జిల్లా తగరపువలస, భీమిలిలోని కేధరిన్ విద్యాసంస్థల చైర్మన్ ఆలీవర్ రాయ్ కరోనా నివారణ చర్యల్లో భాగంగా వలస కూలీలకు సహాయసహకారాలు అందిస్తున్నారు. కాలినడకన, వివిధ వాహనాలు ద్వారా వెళ్తున్న వలస కూలీలకు తగరపువలస వై జంక్షన్ దగ్గర ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. తమ స్వగ్రామాలకు చేరుకోవడానికి కనీసఖర్చులు లేనివారికి, వెళ్లటానికి చెక్ పోస్ట్ పోలీసుల సహాయంతో లారీలు, బస్సులు ఎక్కించి ప్రయాణ ఖర్చులు ఇచ్చి పంపిస్తున్నారు.
వలస కార్మికులకు ఆహారం పంపిణీ... - ఈటీవీ భారత్ తెలుగు తాజా వార్తలు
విశాఖజిల్లాలోని కేధరిన్ విద్యాసంస్థల చైర్మన్ ఆలీవర్ రాయ్ లాక్డౌన్ సమయంలో పేదలకు, వలస కూలీలకు తమ వంతు సహాయసహకారాలందిస్తున్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా వలస కూలీలకు ఆహారం, స్వగ్రామాలకు వెళ్లాలనుకునే వారికి కనీస ఖర్చులకు నగదు అందిస్తూ... తన మానవత్వాన్ని చాటుతున్నారు.

వలస కార్మికులకు ఆహారం పంపిణీ