విశాఖ జిల్లా అనకాపల్లిలో ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద ఉన్న అన్నక్యాంటీన్లో నిరుపేదలకు దేవస్థానం సభ్యులు భోజన పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిరోజూ 200 మందికి ఆహారం పంపిణీ చేస్తున్నారు. లాక్ డౌన్ ఉన్నంతకాలం పేదలకు భోజన వసతి కల్పిస్తామని వారు తెలిపారు.
అనకాపల్లిలో నిరుపేదలకు భోజనం పంపిణీ - food distribution to poor people at anakapalli
కరోనా కష్టకాలంలో నిరుపేదలను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా దాతలు ముందుకొస్తున్నారు. పనుల్లేక, ఆదాయం కోల్పోయిన అన్నార్తులకు తామున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు.

అనకాపల్లిలో నిరుపేదలకు భోజన వసతి