ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరుపేదలకు మధ్యాహ్న భోజనం పంపిణీ - విశాఖలో నిరుపేదలకు మధ్యాహ్న భోజనం పంపిణీ వార్తలు

కర్ఫ్యూ కారణంగా విశాఖ జిల్లాలో రోజువారు కూలీలు ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. వారి ఆకలి బాధలు తీర్చేందుకు.. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అనుచరుడు బొడ్డేటి కిషోర్ ముందుకు వచ్చారు.

food distribution
food distribution

By

Published : May 29, 2021, 4:31 PM IST

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా విధించిన కర్ఫ్యూ కారణంగా.. చాలా మంది కూలీలు ఉపాధిని కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. కరోనా కష్టకాలంలో సుమారు 100 మంది నిరుపేదలకు..విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అనుచరుడు బొడ్డేటి కిషోర్.. మధ్యాహ్న భోజనం పంపిణీ చేస్తున్నారు.

విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని జ్ఞానాపురం, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో ఉండే నిరుపేదలు, ఫుట్ పాత్ లపై నివసిస్తున్న నిరాశ్రయులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. నెల రోజులుగా ఆకలితో ఉన్నవారికి స్వయంగా సహాయసహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details