విశాఖ నుంచి ఇతర రాష్ట్రాలకు కాలినడకన వెళ్తున్న వలస కూలీలకు దాతలు అండగా నిలుస్తున్నారు. విశాఖ నుంచి తగరపువలస మీదుగా ఒడిశా వెళ్లే కార్మికులకు ఓ ప్రైవేట్ విద్యాసంస్థ అధినేత ఆలివర్ రాయ్ ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు ఆలివర్ రాయ్.. భోజనం, బిస్కెట్స్, అరటి పండ్లు, నీరు ఏర్పాటు చేశారు. తగరపువలస నుంచి వారి సొంత ఊళ్లు చేరుకునేందుకు పోలీసుల సహాయంతో.. ప్రయాణఖర్చులు ఇచ్చి లారీల్లో పంపించారు.