రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో భాజపా బలోపేతానికి కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఎమ్మెల్సీ మాధవ్ కోరారు. శనివారం విశాఖ జిల్లా అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ భాజపా కార్యకర్తల శిక్షణా కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో దేశాభివృద్ధి సాధ్యపడుతుందని... అవినీతి రహిత భారతదేశాన్ని నెలకొల్పేందుకు భాజపా కృషి చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆయన సమక్షంలో పలువురు భాజపా తీర్థం పుచ్చుకున్నారు.
భాజపా బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్సీ మాధవ్ - అరకులో భాజపా ఎమ్మెల్సీ మాధవ్
గిరిజన ప్రాంతాల్లో భాజపా బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో భాజపా బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి