'జానపద కళాకారులను ఆదుకోవాలి'
వృతి, రంగస్థల, జానపద కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని... ప్రజా నాట్యమండలి కోరింది. గత ఐదు నెలలుగా కళాకారుల పింఛన్ నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ సీపీఎం కార్యాలయం వద్ద కళాకారులు, ప్రజా నాట్యమండలి ప్రతినిధులు, తమ ప్రదర్శన ద్వారా ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ భాషా సంస్కృతిక విభాగం, సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నాటికలు, నృత్యాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. వాటికి సంబంధించిన చెల్లింపులు నిలిచిపోయాయని ప్రజానాట్య మండలి నగర శాఖ అధ్యక్షుడు దండు నాగేశ్వరరావు తెలిపారు. విశాఖ, భీమిలి, అరకు ఉత్సవాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చామని చెప్పారు. ఐదు నెలలుగా ప్రభుత్వం చెల్లించే కళాకారుల పింఛన్ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీచదవండి:ఏసీ బస్సులకే ప్రాధాన్యం
TAGGED:
vishakapatnam latest news