విశాఖ ఏజెన్సీ కేంద్రం పాడేరులో పొగమంచు.. వర్షపు జల్లుల్లా కురిసింది. వేకువజాము నుంచి పొగమంచు దట్టంగా కమ్మేసి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ద్విచక్ర వాహనదారులు జారి పడుతున్నారు. నాలుగు రోజులుగా ఉదయం 11 గంటలైనా సూర్యుడు కనిపించటం లేదు. మరో పక్క చలి కూడా అధికంగానే ఉంది. చింతపల్లి పరిసరాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
పాడేరులో వర్షాన్ని తలపిస్తున్న పొగమంచు - పాడేరులో పొగమంచు
విశాఖ ఏజెన్సీలో వర్షాన్ని తలపించేలా పొగమంచు కురిసింది. పాడేరు పరిసరాల్లో ఉదయం 11 గంటలైనా సూర్యుడు కనిపించలేదు. చింతపల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
పాడేరులో వర్షాన్ని తలపిస్తున్న పొగమంచు