విశాఖ ఏజెన్సీ లో పొగమంచు దట్టంగా వ్యాపించింది. అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లిలో అత్యల్పంగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండగా... పాడేరులో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాత్రి వేళలో చలి ఎక్కువగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. ఓ పక్క చలి వణికిస్తున్నప్పకీ మన్యం అందాలను తిలకించడానికి పర్యాటకులు పోటీ పడుతున్నారు.
మన్యాన్ని కమ్మేసిన పొగమంచు
మన్యాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఆ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఏజెన్సీ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.
మన్యంలో మంచు