విశాఖ ఏజెన్సీలో వేసవి కాలంలోనూ మంచు సోయగం కట్టిపడేస్తోంది. వీక్షకులకు కనువిందు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఈ అద్భుత దృశ్యాలు.. విశాఖ జిల్లా పాడేరు మండలం అల్లివరం కొండల్లో దర్శనమిచ్చాయి. ఉదయం వరకు మంచు కురుస్తూ.. చలికాల గిలిగింతలు పెట్టి.. మధ్యాహ్నం వేసవిని గుర్తు చేసి.. సాయంత్రానికి వరుణుడు పలకరిస్తున్నాడు. ఒక్క రోజులోనే మూడు కాలాలు చూపిస్తూ.. వేసవి విడిది కోసం వచ్చే పర్యాటకులకు, గిరిజనులకు వింత అనుభూతిని పంచుతోంది విశాఖ మన్యం.
ఒక్కరోజులో మూడు కాలాలు.. ఇదీ విశాఖ ఏజెన్సీ స్పెషల్ వాతావరణం! - fog in summer updates
ఉదయం ఏడు గంటలు దాటితే చాలు సూరీడు సుర్రుమనిపిస్తుండటంతో.. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు ప్రజలు. కానీ.. విశాఖ ఏజెన్సీలో మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది అక్కడి వాతావరణం. మండుటెండల సమయంలో సైతం.. పొగ మంచు కనువిందు చేస్తోంది. మబ్బుల్లో కొండలు తేలియాడుతున్నాయా అన్నట్లు.. చూపరులను కట్టిపడేస్తున్నాయి అక్కడి దృశ్యాలు..
విశాఖ ఏజెన్సీలో మంచు