ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డొంకరాయి జలాశయం నుంచి నీటి విడుదల - డొంకరాయి జలాశయం నుంచి నీటి విడుదల వార్తలు

విశాఖ సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సీలేరు కాంప్లెక్స్ లో జలాశయాలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో డొంకరాయి జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. అధికారులు నీటిని విడుదల చేశారు.

floods water release from donkarai Reservoir
floods water release from donkarai Reservoir

By

Published : Aug 12, 2020, 11:08 PM IST

డొంకరాయి జలాశయంలో వరదనీరు1036 అడుగుల ప్రమాదస్థాయికి చేరుకుంది. అధికారులు రెండు గేట్లు ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయినా జలాశయం నీటిమట్టం తగ్గకపోవడంతో 11 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోపక్క సిలేరు, జోలపుట్, బలిమెల జలాశయాలకు వరద నీరు పోటెత్తింది.

అధికారులు జలాశయాల వద్ద మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డొంకరాయి నుంచి 11 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో తూర్పుగోదావరి జిల్లా ముంపు మండలాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details