భారీ వర్షాలతో వరదలు... కోతకు గురైన గట్లు... - విశాఖలో భారీ వర్షాలు
విశాఖ జిల్లాలోని పెద్దేరు, కోనాం, రైవాడ జలాశయాల నుంచి భారీగా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. కోనాం జలశయ కారణంగా బొడ్డేరు నది గట్టు కోతకు గురైంది. జిరాయితీ భూముల్లోకి వరద నీరు చేరి... సాగునీటి బోరులు పాడయ్యాయి.
floods-in-visakha
విశాఖ జిల్లాపెద్దేరు,కోనాం,రైవాడ జలాశయాల నుంచి భారీగా నీరు దిగువకు విడుదల అవుతోంది. ఈ ధాటికినదులు,కాలువ గట్లు కోతకు గురౌతున్నాయి.కోనాం జలాశయ నీటి ప్రభావంతో ఏటి కాలువ,బొడ్డేరు నది గట్లు కొట్టుకుపోయాయి.మూడు రోజులుగా ఉన్న నీటి ఉద్ధృతితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జిరాయితీ భూముల్లోకి వరద నీరు చేరి బోరులు పాడయ్యాయి.వరద కారణంగా కొబ్బరి చెట్లు సైతం నేలకొరిగాయి.రోడ్లు కోతకు గురై ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.