విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నుంచి గేట్లు ఎత్తి 793 క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 787 క్యూసెక్కులు జలాశయంలోకి వస్తోంది. నీటిమట్టం 135.90 మీటర్లకు చేరుకుంది.
పెద్దేరు, కోనాం జలాశయాల నుంచి నీరు విడుదల - News on chidikada project
విశాఖ జిల్లాలో పెద్దేరు, కోనాం జలాశయాల నుంచి దిగువ నదుల్లోకి భారీగా వరద నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు జలాశయాల్లోకి వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. నీటిమట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి.
పెద్దేరు, కోనాం జలాశయాలు నుంచి భారీగా వరదనీరు విడుదల
చీడికాడ మండలం కోనాం జలాశయంలోకి ఎగువ నుంచి వరదనీరు పోటెత్తుతోంది. ఇన్ ఫ్లో 580 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 450 క్యూసెక్కులు. నీటిమట్టం 100.60 మీటర్లకు పెరిగింది. పెద్దేరు, బొడ్డేరు నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: నదీ జలాల వివాదం: నేడు అపెక్స్ కౌన్సిల్ కీలక సమావేశం