ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డొంకరాయ జలాశయం నుంచి నీరు విడుదల - విశాఖ

అల్పపీడన ప్రభావం వల్ల గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సీలేరు పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. డొంకరాయి జలాశయ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది.

డొంకరాయ జలాశయం నుండి దిగువ ప్రాంతాలకు నీరు విడుదల

By

Published : Aug 2, 2019, 7:23 PM IST

డొంకరాయ జలాశయం నుండి దిగువ ప్రాంతాలకు నీరు విడుదల

గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలో జలాశయాలకు పెద్ద ఎత్తున వరద నీటి నిల్వలు చేరాయి. డొంకరాయి జలాశయ నీటిమట్టం పూర్తిస్థాయికు చేరుకోగా... రెండు గేట్లు ఎత్తి 3900 క్యూసెక్కుల వరదనీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. అయినా ఏమాత్రం నీటి నిల్వలు తగ్గకపోవడంతో మూడు గేట్లు ఎత్తి సుమారు 17వేలు క్యూసెక్కులు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. అదే విధంగా ఎవీపీడాం నుంచి రెండు గాట్లు ఎత్తి 3వేలు క్యూసెక్స్ నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.
సీలేరు ప్రాంతంలో భారీ వర్షం
సీలేరు అటవీప్రాంతంలో భారీ వర్షం కారణంగా...ఊహించని విధంగా వరదనీరు డొంకరాయి జలాశయానికి చేరింది. అప్రమత్తమైన ఏపి జెన్​కో కార్యనిర్వాహక ఇంజనీర్(ఈఈ) వి.ఎల్‌.రమేష్ ఆధ్వర్యంలో...జలాశయం మూడు గేట్లను ఎత్తి 17000 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి వదిలారు. శబరి పరివాహక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని... వరదనీరు పెరిగే అవకాశం ఉన్నందున మరిన్ని గేట్లు ఎత్తె అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఒడిశా లోని ఎగువప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో... అధికారులు వరదనీరు దిగువకు వదులుతున్నారు. దీంతో డొంకరాయి జలాశయం గేట్లు మరో రెoడు ఎత్తే అవకాశం వుందని జెన్​కో ఈఈ రమేష్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details