ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీలేరు జలాశయం నుంచి నీటి విడుదల - flood water release from seleru

నాలుగురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల నదులు, జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు నీటిని దిగువకు వదలుతున్నారు. విశాఖలోని సీలేరు జలాశయానికి అధిక మెుత్తంలో నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు జలాశయం రెండు గేట్లును ఎత్తి 6వేల క్యూసెక్కులు నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు.

సీలేరు జలాశయం నుంచి నీరు విడుదల
సీలేరు జలాశయం నుంచి నీరు విడుదల

By

Published : Aug 16, 2020, 1:40 PM IST


అల్పపీడన ప్రభావం వల్ల గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సీలేరు పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలో జలాశయాలకు పెద్ద ఎత్తున వరదనీటినిల్వలు చేరాయి. శనివారం రాత్రికి సిలేరు జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. దీంతో రెండు గేటులు ఎత్తి 6000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అయినా రిజర్వాయర్​లో నీటినిల్వ మట్టం త‌గ్గ‌క‌పోతే ఇంకా ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేస్తామని జెన్‌కో అధికారులు తెలిపారు. శబరి పరివాహక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వరదనీరు పెరిగే అవకాశం ఉందన్నారు.


ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details