విశాఖ జిల్లాలోని శారదానదిలో వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతుంది. జిల్లాలో అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఎగువనున్న దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నుంచి గేట్లు ఎత్తి పెద్దఎత్తున అదనపు నీటిని విడుదల చేయడంతో... నదులు, వాగుల వరదనీరు శారదానదిలో కలసి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో క్రమేపీ శారదానది నీటి ప్రవాహం తగ్గి.. శాంతించింది. ప్రస్తుతం రైవాడ జలాశయం నుంచి కొంత మేరకు మాత్రమే అదనపు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నది పరివాహక ప్రాంత ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే శారదానది ఉద్ధృతికి... నదిపై ఉన్న కాజ్ వేలు కొట్టుకుపోగా... నది గట్లు కోతకు గురయ్యాయి. దిగువ పొలాలు ముంచెత్తడంతో రైతులకు భారీ నష్టమే చేకూరింది.
శాంతిస్తున్న శారదా నది... ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు - విశాఖలో శారదా నదికి తగ్గిన వరద ప్రవాహం
విశాఖ జిల్లాలోని శారదానదికి వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. ఎగువనున్న దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నుంచి గేట్లు ఎత్తి పెద్దఎత్తున అదనపు నీటిని విడుదల చేయడంతో నదికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం శారదా నదికి వరద ఉద్ధృతి తగ్గటంతో నది పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
శాంతిస్తున్న శారదా నది... ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు