ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిండు కుండను తలపిస్తున్న తాండవ జలాశయం - విశాఖ జిల్లా తాండవ జలాశయం తాజా వార్తలు

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖ జిల్లాలో జలాశయాలకు జలకళ సంతరించుకుంది. నాతవరం మండలం తాండవ జలాశయంలో వరద నీరు అధికంగా చేరడంతో గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల అధికారులు చేశారు.

flood flow in tandava reservoir
నిండు కుండను తలపిస్తున్న తాండవ జలాశయం

By

Published : Sep 18, 2020, 11:34 AM IST

విశాఖ జిల్లాలో జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. పూర్తి స్థాయి నీటిమట్టంతో కనువిందు చేస్తున్నాయి. నాతవరం మండలం తాండవ జలాశయంలో వరద నీరు అధికంగా చేరడం.. అధికారులు గేట్లు తెరిచి కిందకు నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి అనుగుణంగా ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని బట్టి ఏరోజుకారోజు గేట్లు తెరిచి అదనపు నీటిని కిందకు వదులుతున్నట్లు తెలిపారు. మరో రెండు మూడు రోజులు ఇదే ప్రక్రియ కొనసాగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details