విశాఖ మన్యంలో వర్షాల కారణంగా గిరిజనులు నానా కష్టాలు పడుతున్నారు. జి. మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ ప్రాంతంలో నీటి ప్రవాహం తగ్గినా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సక్రమంగా లేకపోయినా మద్దిగరువు నుంచి కోడిమామిడి గడ్డ వరకు ద్విచక్ర వాహనాల్లో వెళ్తున్నారు. గడ్డ ప్రవాహ ఉద్ధృతికి ద్విచక్ర వాహనాలను... గిరిజనులు కర్రలతో డోలీ కట్టి దాటించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకెప్పుడు వంతెన నిర్మాణమవుతుందోనని ఆవేదన చెందుతున్నారు. మరోపక్క పెదబయలు మండలం మారుమూల జామిగుడ గెడ్డ వద్ద గడ్డలు దాటించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రవాహం దాటాలంటే.. బైక్కు డోలీ కట్టాలి - విశాఖ మన్యంలో వరదలు న్యూస్
వర్షాలు తగ్గుముఖం పట్టాయి అయినా విశాఖ మన్యంలో గిరిజనుల కష్టాలు గట్టెక్కట్లేదు. జి. మాడుగుల మండలం కిల్లం కోట పంచాయతీ ప్రాంతంలో నీటి ప్రవాహం తగ్గినా ఇటువైపు వారు అటువైపుకు వెళ్లేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. ద్విచక్రవాహనాలకు డోలీ కట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
![ప్రవాహం దాటాలంటే.. బైక్కు డోలీ కట్టాలి ప్రవాహం దాటాలంటే.. బైక్కు డోలీ కట్టాలిక్కడ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8607414-433-8607414-1598711474926.jpg)
ప్రవాహం దాటాలంటే.. బైక్కు డోలీ కట్టాలిక్కడ