ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కల్యాణపులోవ జలాశయం గేట్లు ఎత్తివేత - కల్యాణపులో జలాశయంపై వార్తలు

విశాఖ జిల్లా కల్యాణపులోవ జలాశయం పరిసరాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో జలాశయం నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో సాయంత్రం అత్యవసరంగా నాలుగు గేట్లు ఎత్తి 200 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడిచారు.

flood at kalyanapu lova resevoiur
కల్యాణపులో జలాశయం వద్ద వరద

By

Published : Oct 5, 2020, 9:58 AM IST

విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయం వద్ద వరద నీటి ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం నాలుగు గేట్లను ఎత్తి అదనపు నీటిని బయటకు పంపిస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా, గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటి మట్టం 459.5 అడుగులకు చేరడంతో నాలుగు గేట్లను ఎత్తి నీటిని బయటకు పంపిస్తున్నామని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇన్​ఫ్లో 250 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 200 క్యూసెక్కులు. ఈ మేరకు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details