విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ అధికమవుతున్నాయి. ఇప్పటికే పెద్ద బొడ్డేపల్లి, చెట్టుపల్లి, నీలంపేట, శివపురం తదితర గ్రామాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. బీసీ కాలనీ, ప్రశాంత్ నగర్ తదితర చోట్ల మరో ఐదు కేసులను గుర్తించారు. ఆ ప్రాంతమంతా పారిశుద్ధ్య సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లారు. రసాయనాలను పిచికారీ చేశారు. ఇందుకు సంబంధించి మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యారు. మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి తదితర ఉన్నతాధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
నర్సీపట్నం పురపాలక పరిధిలో మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు - నర్సీపట్నంలో కరోనా వార్తలు
విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ అధికమవుతున్నాయి. బీసీ కాలనీ, ప్రశాంత్ నగర్ తదితర చోట్ల మరో ఐదు కేసులు గుర్తించారు.
నర్సీపట్నం పురపాలక పరిధిలో మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు