ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఐదుగురు మైనర్లు అరెస్ట్ - చోరీ కేసుల్లో ఐదుగురు మైనర్లను అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు

విశాఖలోని ఓ హోటల్ కార్మికుడి నుంచి రూ. 40 వేలు చోరీ చేసిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 19 ఏళ్ల ప్రధాన నిందితుడు నెక్కల నారాయణరావు వ్యూహం మేరకు.. నలుగురు మైనర్లు దొంగతనానికి పాల్పడినట్లు డీసీపీ సురేష్ బాబు తెలిపారు. మరో ఘటనలో ఏటీఎంను పగులగొట్టిన దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతడిని మైనర్​గా గుర్తించారు.

visakha police caught five minors in two theft cases
విశాఖలో రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఐదుగురు మైనర్లు అరెస్ట్

By

Published : Mar 20, 2021, 4:11 PM IST

రెండు వేర్వేరు చోరీ కేసుల్లో.. ఐదుగురు మైనర్లతో పాటు మరో 19 ఏళ్ల ప్రధాన నిందితుడు నెక్కల నారాయణరావును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్​లో పనిచేసే వ్యక్తి నుంచి.. రూ. 40 వేలు చోరీ అయిన కేసును ఛేదించారు. బాధితుడు పని మగించుకుని ఇంటికి వెళ్తుండగా.. ప్రణాళిక ప్రకారం అతడి వద్ద నగదును దోచేశారని డీసీపీ సురేష్ బాబు పేర్కొన్నారు.

నారాయణరావు పన్నిన వ్యూహం మేరకు.. నలుగురు మైనర్లు 2 ఖరీదైన బైక్​లపై వెనుక నుంచి బాధితుడిపై దాడి చేసి నగదు లాక్కున్నట్లు డీసీపీ వెల్లడించారు. అతడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను గుర్తించారని చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 35 వేలతో పాటు రెండు ద్విచక్రవాహనాలు, కొంత వైరును స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో ఏటీఎంను పగులగొట్టేందుకు యత్నించిన మైనర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details