విశాఖపట్నం జిల్లా సీలేరు జలవిద్యుత్ కేంద్రానికి కార్యనిర్వాహక ఇంజినీరుగా బదిలీపై వచ్చిన అధికారికి మంగళవారం రాత్రి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ కేసుతో అప్రమత్తమైన అధికారులు.. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. వీరిలో నలుగురు ఇంజినీర్లకు పాజిటివ్ వచ్చినట్లు ప్రాజెక్టు పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు.
సీలేరులో కరోనా కలకలం.. ఐదుగురు ఇంజినీర్లకు వైరస్... - సీలేరులో కరోనా
విశాఖపట్నం జిల్లా సీలేరులో కరోనా కలకలం రేగింది. సీలేరు జల విద్యుత్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఫలితంగా ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు నిర్వహించగా... మరో నలుగురు ఇంజినీర్లకు పాజిటివ్ తేలింది.
సీలేరులో కరోనా కలకలం.. అయిదుగురు ఇంజినీర్లకు కరోనా పాజిటివ్