పెందుర్తి మేఘాద్రి గడ్డ రిజర్వాయర్లో చేపలు చనిపోవడం కలకలం రేపింది. వేపగుంట పినగాడి రహదారిలో మేఘాద్రి రిజర్వాయరు వంతెన కింద బొచ్చు చేపలు చనిపోయి కనిపించాయి. ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత ఈ రిజర్వాయర్లోని చేపలను ఎవరూ తినడం లేదు. ఇటీవల జీవీఎంసీ అధికారులు నీటిని పరీక్షించిన అనంతరం వినియోగించుకోవచ్చని ప్రకటించారు.
ఇంతలో పెద్ద ఎత్తున చేపలు మృత్యువాత పడటం స్థానికులను కలవరపాటుకు గురిచేసింది. అన్ని రకాలు కాకుండా కేవలం బొచ్చు చేపలు మాత్రమే చనిపోవడం అనుమానాలకు తావిస్తోందని ప్రజలు అంటున్నారు. అధికారులు ఈ ఘటనకు గల కారణాలను పరిశీలించి వాస్తవాలు బయటపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.