Fishermen problems at vishaka: ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూకు సంబంధించి.. ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వకుండా బోట్లు ఆపేశారని.. విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లీట్ రివ్యూ ఆంక్షలు తెలియక.. లక్షల పెట్టుబడితో వేట కోసం బోట్లు సిద్ధం చేసుకున్నామని వాపోతున్నారు. ఉన్నపళంగా బోట్లు ఆపేస్తే నష్టపోతామని.. తమను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
అంతేకాక ఫ్లీట్ రివ్యూ కోసం వినియోగించే బోట్లను కూడా కాకినాడ నుంచి పిలిపించుకుని.. స్థానికులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చేపల వేటకు వెళ్లకపోతే తాము నష్టపోతామని.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, మత్స్యకారులు కోరుతున్నారు.