వేట నిషేధ సమయంలో ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి! - boats
వేట నిషేధ కాలంలో పరిహారం చెల్లించాలని మత్స్యకార సంఘం డిమాండ్ చేసింది. విశాఖ జీవీఎంసీ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద మత్స్యకారులు ధర్నా చేశారు.
చేపల వేట నిషేధం వల్ల రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది మత్స్యకారులు తమ జీవోనోపాధిని కోల్పోతున్నారని మత్స్యకార సంఘం ఆవేదన చెందింది. 2017-18 సంవత్సరాల్లో రాష్ట్రంలో పరిమితంగా కేవలం 60వేల మందికి మాత్రమే ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని సంఘం రాష్ట్ర కార్యదర్శి కోవిరి అప్పలరాజు ఆరోపించారు. వేట చేస్తున్న కళాసీలకు, మత్స్య వృత్తి చేసే మహిళలకు, బోట్లలో నీళ్లు వేసే వారికి, ఐస్ పెట్టేవారికి పరిహారం అందలేదని ఆవేదన్నారు. విశాఖ జిల్లాలో 40 వేల మందిపై నిషేధం ప్రభావం ఉంటే.. 19 వేల మందికి మాత్రమే పరిహారం ఇచ్చారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ పరిహారంతో పాటు రేషన్ సరుకులనూ అందించాలని డిమాండ్ చేశారు.