విశాఖ జిల్లా పరవాడ పెద్దచెరువులో ఫార్మావ్యర్థాల కారణంగా చేపలు మృత్యువాడ పడుతున్నాయి. 40 ఎకరాలు విస్తీర్ణమున్న ఈ చెరువు కింద 110 ఎకరాలు సాగవుతోంది. వ్యర్థాలు కలవడం వల్ల ఆ భూములు కలుషితమై సాగుకు పనికిరాకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ చాలా సార్లు అధికారులకు నివేదించామని.. పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. ఫార్మా వ్యర్థాలతో కలుషితం అవుతున్న చెరువును పరిరక్షించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఫార్మా వ్యర్థాలతో.. పరవాడ చెరువులో చేపలు మృత్యువాత
ఫార్మా వ్యర్థాల కారణంగా పరవాడ చెరువురో చేపలు మృత్యువాతపడుతున్నాయి. తమ పొలాలు సైతం వ్యర్థాలతో కలుషితమై పనికి రాకుండా పోతున్నాయని.. పరవాడ చెరువును రక్షించాలని రైతులు కోరుతున్నారు.
fish died with effect of pharma waste