విశాఖ మన్యంలో తొలి కరోనా కేసు నమోదయ్యింది. చింతపల్లిలో ఓ మహిళకు పాజిటివ్ నిర్ధరణ కావటంతో విశాఖపట్నం తరలించారు. కొవిడ్ కేసుతో పోలీసులు, అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. పాజిటివ్ వచ్చిన మహిళ ప్రాథమిక కాంటాక్ట్స్ గురించి ఆరా తీస్తున్నారు. ముగ్గురు అనుమానితులను పరీక్షల కోసం నర్సీపట్నం పంపించారు. చింతపల్లిని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు.
విశాఖ మన్యంలో తొలి కేసు... చింతపల్లిలో మహిళకు పాజిటివ్ - విశాఖ మన్యంలో కరోనా కేసు వార్తలు
రాష్ట్రంలో ఇప్పటివరకు పట్టణాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి పల్లెలు, ఏజెన్సీ ప్రాంతాలకూ పాకుతోంది. విశాఖ మన్యం చింతపల్లిలో తొలి కరోనా కేసు నమోదైంది. పాజిటివ్‌గా తేలిన మహిళను విశాఖపట్నం తరలించారు.
విశాఖ మన్యంలో తొలి కేసు