విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం బలిఘట్టంలో అగ్నిమాపక శాఖ అధికారి జనార్ధన్ రావు బాణాసంచా విక్రయదారులతో సమావేశాన్ని నిర్వహించారు. నర్సీపట్నం పరిసర ప్రాంతాలకు సంబంధించి కేవలం 25 మందికి మాత్రమే బాణాసంచా విక్రయానికి అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. అంతకుమించి ఎవరైనా విక్రయాలు జరిపితే చర్యలు తీసుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. కరోనా నిబంధనలను అనుసరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విక్రయదారులకు అగ్నిమాపక అధికారి జనార్ధన్ రావు స్పష్టం చేశారు.
'బాణాసంచా విక్రయదారులు తగిన జాగ్రత్తలు చేపట్టాలి' - విశాఖ జిల్లా తాజా వార్తలు
దీపావళి నేపథ్యంలో బాణాసంచా విక్రయదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని నర్సీపట్నం అగ్నిమాపక శాఖ అధికారి జనార్ధన్ రావు తెలిపారు. ఈ మేరకు బలిఘట్టం అగ్నిమాపక కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
బాణాసంచా విక్రయాదారులతో సమావేశం నిర్వహించిన అగ్నిమాపకధికారి