సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని అగ్నిమాపక భద్రత ఇన్స్పెక్టర్ శైలేంద్ర కుమార్ పరిశీలించారు. ఇటీవల శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగిన క్రమంలో సీలేరులో తనిఖీలు చేశారు. అగ్నిప్రమాదాలు, ఇతర ప్రమాదాల నివారణకు ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారనే విషయాలను పరిశీలించారు. జలవిద్యుత్ కేంద్రంలోని కంట్రోల్ రూమ్, టర్బయిన్ ప్లోర్, ట్రాన్స్ఫార్మర్స్, 200 కేవీ సబ్ స్టేషన్ను పరిశీలించారు.
ఏపీ జెన్కో డీఈఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భద్రతా ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయో లేవో తనిఖీ చేశారని చెప్పారు. ప్రతి 2, 3 సంవత్సరాలకు ఒకసారి ఇలా చేయడం సాధారణమేనని తెలిపారు. రక్షణ చర్యలకు సంబంధించి ఆ బృందం ఇచ్చిన సూచనలు పాటిస్తామని తెలిపారు.