విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అన్నవరంలో ప్రమాదవశాత్తు జీడి మామిడి తోటలలో అగ్నిప్రమాదం సంభవించింది. అజాగ్రత్త, నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాల్చిపడేసిన సిగరెట్లు, బీడీలు, చుట్టల వలన ఎండుటాకులు అగ్నికి ఆజ్యం పోశాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిట్టివలస అగ్నిమాపక శకటంతో పాటు దివిస్ ఫైర్ ఇంజన్ సంఘటనా స్ధలానికి సకాలంలో చేరకుని మంటలను అదుపు చేసాయి. జీడి మామిడి తోటల పక్కనే అన్నవరం, జీరుపాలెం గ్రామాలతో పాటు దివీస్ కంపెనీ పక్కనే ఉన్నప్పటికీ ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
జీడి మామిడి తోటల్లో అగ్నిప్రమాదం - విశాఖ జిల్లాలో అగ్ని ప్రమాదం
విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అన్నవరంలో ప్రమాదవశాత్తు జీడి మామిడి తోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. చిట్టివలస అగ్నిమాపక శకటంతో పాటు దివిస్ ఫైర్ ఇంజన్ సకాలంలో ఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపు చేశాయి.
అన్నవరం జీడి, మామిడి తోటల్లో అగ్నిప్రమాదం