ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు.. ఆర్పేసిన స్థానికులు
విశాఖలోని దొండపర్తి కూడలి సమీపంలో.. ద్విచక్రవాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు.. స్కూటర్ మొత్తం చుట్టుముట్టాయి. అప్రమత్తమైన స్థానికులు.. అత్యవసర ఫైర్ ఫైట్ సిలిండర్‌తో మంటలను అదుపుచేశారు.