కారును తగలబెట్టేశారు - paderu
విశాఖ మన్యం పాడేరులో ఆర్టీసీ అధికారి కారును అర్థరాత్రి తగులబెట్టేశారు.
ఆర్డీసీ అధికారి కారు
విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ క్వార్టర్స్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కారును తగలబెట్టారు. ఆర్టీసీ డీఎం. రమేష్ వాహనానికి అర్థరాత్రి 2 గంటలకు దుండగులు నిప్పంటించారు. స్థానికుల సమాచారంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చేలోపే ముందుభాగం పూర్తిగా కాలిపోయింది. ఇటీవల డీఎంకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వ్యక్తులపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.