విశాఖలో ఎల్జీ పాలిమర్స్, సాయినార్ ఫార్మా, సాల్వెంట్స్ ప్రమాదాల్ని మరువకముందే షీలానగర్ దరి గేట్‌వే ఈస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీ యార్డులోని కంటైనర్ టెర్మినల్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఓ కంటైనర్ నుంచి మరో కంటైనర్‌లోకి సోడియం క్లోరైడ్ పొడిని మారుస్తుండగా ఓ బస్తా లీకైంది. బస్తాలు మారుస్తున్న ఫోర్క్ లిఫ్ట్‌నకు పొడి రాపిడి జరిగి మంటలు రేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్, అక్కడ పని చేస్తున్నవారు పరుగులు తీశారు. మంటలతోపాటు దట్టమైన పొగ రావటంతో సిబ్బంది, స్థానికులు ఆందోళన చెందారు. పెదగంట్యాడ అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటల్ని అదుపు చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల విలువైన సోడియం క్లోరైడ్ పొడితోపాటు మూడు కంటైనర్లు స్వల్పంగా దగ్ధమయ్యాయి.
విశాఖలో మరో అగ్నిప్రమాదం - vizag latest fire accident news
విశాఖలో షీలానగర్ దరి గేట్‌వే ఈస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ. 10లక్షల విలువైన సోడియం క్లోరైడ్ పొడితోపాటు మూడు కంటైనర్లు స్వల్పంగా దగ్గమయ్యాయని సిబ్బంది తెలిపారు.
fire accidnet in visakha dst shilanagar dari gateway east India private limited