పరవాడ రాంకీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్స్ సంస్థలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో అనకాపల్లికి చెందిన కాండ్రేగుల శ్రీనివాసరావు మృతి చెందారు. శ్రీనివాస రావు భార్య పార్వతి మూడేళ్ళ క్రితం మృతి చెందింది. ఇద్దరు మగ పిల్లలు, వృద్ధురాలైన తల్లితో కలసి శ్రీనివాస రావు బట్లపూడి పంచాయతీ రాయుడుపేటలో నివసిస్తున్నారు. తల్లి మృతినే మూడేళ్లుగా జీర్ణించుకోలేకపోతున్న ఆ ఇద్దరు పిల్లలు.. ఇప్పుడు తండ్రి మరణంతో బోరున విలపిస్తున్నారు. మమ్మల్ని అనాథలను చేసి పోయావా నాన్నా.. అంటూ ఆ పిల్లల శోకం ఆ ప్రాంత వాసులను కలచివేసింది. పెద్ద కుమారుడు రోహిత్ కుమార్ పాలిటెక్నిక్ డిప్లమో పూర్తి చేశాడు. రెండో కుమారుడు జశ్వంత్ కుమార్ పదో తరగతి పూర్తి చేశాడు. కుటుంబ పెద్ద ఇక లేరని తెలిసి ఆవేదన చెందుతున్నారు.
అందరికీ అండగా ఉండేవాడు.. అనాథలను చేసి పోయాడు - విశాఖ సాల్వెంట్స్ సంస్థలో అగ్ని ప్రమాదం
శ్రీనివాస్ తండ్రి చిన్న తనంలోనే మృతి చెందారు. దీంతో కుటుంబ భారమంతా తన భుజాలపై మోశారు శ్రీనివాస్. అక్క భర్త చనిపోవడంతో మేనకోడళ్లని ఇద్దరినీ తానే పెంచి పెళ్లిళ్లు చేశారు. తనూ పెళ్లి చేసుకుని ఇద్దరు మగ పిల్లలకు తండ్రయ్యారు. మూడేళ్ల క్రితం భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలనూ, కన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. సోమవారం రాత్రి విశాఖ సాల్వెంట్స్ సంస్థలో జరిగిన అగ్ని ప్రమాదంలో అక్కడే పనిచేస్తున్న శ్రీనివాస్ మృతిచెందారు. ఆయన మరణంతో ఆ కుటుంబం అనాథ అయిపోయింది.
అనకాపల్లికి చెందిన సన్నమ్మడుకి కాండ్రేగుల శ్రీనివాసరావు ఒక్కగానొక్క కొడుకు. శ్రీనివాస్ చిన్నప్పుడే తండ్రి మృతి చెందారు. దీనితో తల్లి సన్నమ్మడు కొడుకు, ఇద్దరు కూతుళ్లని పెంచి పెద్దచేసింది. శ్రీనివాసరావు అక్కా, చెల్లెలకు పెళ్లైంది. 10 ఏళ్ల క్రితం చెల్లి రేవతి భర్త మృతి చెందడంతో మేన కోడళ్లు ఇద్దరిని శ్రీనివాసే పెంచి.. వివాహాలు చేశారు. ఇలా కుటుంబంలో అందరినీ ఆదుకుంటున్న వ్యక్తి మృతి చెందడంతో..ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
ఇదీ చదవండి:
కరోనా బాధితురాలు.. ఆసుపత్రిలో పడకలు లేవని బస్సులో ఇంటికెళ్లింది!
TAGGED:
vishaka fire accident news