విశాఖ కేంద్ర కారాగారం ఎదుట రామకృష్ణపురంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగక పోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఇళ్లలోని పెద్దలు కూలి పనులకు వెళ్లగా...పిల్లలు బయట ఆడుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో పక్కన ఉండే పాకలకు అగ్నికీలలు వ్యాపించలేదు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయామని... బాధితులు ఆవేదన చెందుతున్నారు.
రామకృష్ణాపురంలో అగ్ని ప్రమాదం - విశాఖ కేంద్ర కారాగారంలో అగ్ని ప్రమాదం
విశాఖ కేంద్ర కారాగారం ఎదుట రామకృష్ణాపురంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది పాకలు దగ్ధమయ్యాయి.
రామకృష్ణపురంలో అగ్ని ప్రమాదం