Fire Accident In Narsipatnam: విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలోని ఫాల్గాట్ కూడలి సమీపంలో స్కూల్కు సంబంధించిన వస్తువులు విక్రయించే దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్యాగ్లతో పాటు ప్లాస్టిక్ సామగ్రి కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదాన్ని లంబసింగి వెళ్తున్న కొంతమంది యువకులు గుర్తించారు. షాప్ మీద ఉన్న సెల్ఫోన్ నంబర్ ఆధారంగా యజమానికి ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అక్కడికి యజమాని పరుగున వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణమే ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.