విశాఖపట్నం మురళీనగర్‌లోని వర్మ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న అపోలో ఫార్మసీ మందుల దుకాణంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణంలో ఉన్న సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అప్పటికే దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. సుమారు 25 లక్షల విలువ చేసే మందులు కాలి బూడిదైనట్లు అపోలో ఫార్మసీ సిబ్బంది తెలిపారు. దుకాణంలోని బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది బావిస్తున్నారు. సిబ్బందికి ఎటువంటి హాని జరగలేదని, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.
విశాఖలో అగ్ని ప్రమాదం..మందుల దుకాణం దగ్ధం - అగ్ని ప్రమాదం
విశాఖలోని ఓ మందుల దుకాణంలో(అపోలో ఫార్మసీ)అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మందుల దుకాణంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరేలోపే మందుల దుకాణం మొత్తం అగ్నికి ఆహుతయ్యింది.
![విశాఖలో అగ్ని ప్రమాదం..మందుల దుకాణం దగ్ధం fire-accident-in-medical-shop](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12330590-128-12330590-1625210878770.jpg)
fire-accident-in-medical-shop