విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు సమీపంలోని జాతీయ రహదారిపై ఓ కంటైనర్ దగ్ధమైంది. మెర్స్ క్యారియర్స్ సంస్థకు చెందిన ఏసీ కంటైనర్ తెల్లవారుజామున 5 గంటల సమయంలో విశాఖపట్నం నుంచి భీమవరం బయల్దేరింది. నక్కపల్లి మండలం వేంపాడు సమీపానికి చేరుకునే సరికి కంటైనర్‌కు విద్యుత్ అందించే మోటారు వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమై కిందికి దూకేయటంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న తుని అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
షార్ట్ సర్క్యూట్‌తో కంటైనర్ దగ్ధం - కంటైనర్‌లో అగ్ని ప్రమాదం న్యూస్
విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు సమీపంలోని జాతీయ రహదారిపై ఓ కంటైనర్ దగ్ధమైంది. కంటైనర్‌కు విద్యుత్ అందించే మోటారు వద్ద షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై కిందకి దూకేయటంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
![షార్ట్ సర్క్యూట్‌తో కంటైనర్ దగ్ధం http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/14-December-2019/5372418_700_5372418_1576326517118.png](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5372418-700-5372418-1576326517118.jpg)
fire accident in container with short circuit