ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

fire accident: పూర్ణామార్కెట్​లోని షాపులో అగ్ని ప్రమాదం... - fire accident latest news

విశాఖ పూర్ణామార్కెట్​లోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. పోలీస్​, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి... పెను ముప్పును తప్పించారు. ఈ ఘటనలో సుమారు మూడు లక్షల నష్టం వాటిల్లినట్లు దుకాణదారుడు తెలిపారు.

fire accident
అగ్ని ప్రమాదం

By

Published : Jun 24, 2021, 7:08 AM IST

పూర్ణామార్కెట్​లోని ఓ షాపులో అగ్ని ప్రమాదం

విశాఖ పూర్ణామార్కెట్​లోని పూసల సత్యనారాయణ ఫొటో ఫ్రేమ్ వర్క్ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీస్​, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. పక్కన ఉన్న షాపులకు నిప్పంటుకోకుండా మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దుకాణంలోని సుమారు మూడు లక్షల రూపాయలు విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యిందని షాపు యజమాని తెలిపారు. విద్యుత్ షార్ట్​ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details