విశాఖ జిల్లా మాడుగుల మండలం జమ్మాదేవిపేటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి షాట్ సర్క్యూట్తో గ్రామంలోని ఓ కిరాణా దుకాణం పూర్తిగా దగ్ధమైంది. అందులోని సామగ్రి, సరకులు, రిఫ్రిజిరేటర్, నగదు కాలిబూడిదయ్యాయి. జీవనాధారణమైన దుకాణం మంటలకు ఆహుతి కావడం వల్ల యజమాని తవ్వా సత్యారావు కన్నీటి పర్యంతమయ్యారు. అగ్నిమాపక శకటం వచ్చినప్పటికీ దుకాణం పూర్తిగా కాలిపోయింది. లక్ష రూపాయల వరకూ ఆస్తి నష్టం జరిగినట్టు బాధితుడు వాపోయాడు.
అర్ధరాత్రి మంటలు... ఆహుతైన దుకాణం - shot circuit
ఓ కిరాణా దుకాణంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళం వచ్చేలోపే దుకాణం పూర్తిగా దగ్ధమైపోయింది.
దుకాణంలో అగ్నిప్రమాదం