విశాఖపట్టణంలోని ఎన్ఏడీ జంక్షన్లో ఓ కారులో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జంక్షన్లో క్వాలిస్ కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి.ఈ క్రమంలో అందులో ఉన్న ప్రయాణికులు అప్రమత్తం కావడం వల్ల పెను ప్రమాదం తప్పింది. మంటల్లో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించారు.
కారులో చెలరేగిన మంటలు.. ప్రయాణికులు సురక్షితం - మంటల్లో కారు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం
విశాఖలోని ఎన్ఏడీ జంక్షన్లో ఓ కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలో కారు పూర్తిగా కాలిపోగా ...అందులో ఉన్నవాళ్లు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
కారులో చెలరేగిన మంటలు.. ప్రయాణికులు సురక్షితం