Fire Accident At Sithammadhara In Visakhapatnam: దివ్యాంగురాలైన ఓ యువతి మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైంది. ఈ హృదయ విదారక ఘటన విశాఖ నగరంలోని సీతమ్మధార కొండవాలు ప్రాంతం బిలాల్‌కాలనీలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. బిలాల్‌కాలనీకి చెందిన సబ్బి వెంకట్రావు, భార్య కూలీ పనులు చేస్తుంటారు. వీరికి కుమార్తె రమ(19), కుమారుడు శేఖర్(14) సంతానం. వీరిద్దరూ దివ్యాంగులు. పూరి గుడిసెలో నివాసముంటున్నారు. గురువారం ఇద్దరు పిల్లలతో పాటు వెంకట్రావు తల్లి చానమ్మ(75)ను ఇంటిలో ఉంచి భార్యాభర్తలిద్దరూ ఉదయాన్నే కూలి పనులకు వెళ్లిపోయారు.
అగ్నికి ఆహుతైన దివ్యాంగురాలు.. - అగ్నికి ఆహుతైన దివ్యాంగురాలు
Fire Accident At Sithammadhara In Visakhapatnam: దివ్యాంగురాలైన ఓ యువతి మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైంది. ఈ హృదయ విదారక ఘటన విశాఖ నగరంలోని సీతమ్మధార కొండవాలు ప్రాంతం బిలాల్‌కాలనీలో గురువారం ఉదయం చోటుచేసుకుంది.
Fire Accident At Sithamma dhara
ఉదయం 9 గంటల సమయంలో.. దేవుడి దగ్గర వెలిగించిన దీపం గుడిసెకు అంటుకుని ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు గుడిసెలో ఉన్న శేఖర్, చానమ్మను బయటకు తీసుకొచ్చి రక్షించగలిగారు. కదలలేని స్థితిలో ఉన్న రమను కాపాడేలోపే ఆమె శరీరమంతా మంటలు అంటుకుని సజీవ దహనమైంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు వార్డు కార్పొరేటర్ అనిల్‌కుమార్ రూ.10 వేలు సాయం అందజేశారు.
ఇవీ చదవండి: